5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

Writer: Chandrika 10:29 AM, 5 అక్టోబర్, 2026
రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ 92 పరుగుల వద్ద ఔటై తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. రోహిత్ మూడంకెల స్కోరును అందుకోకపోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ నిరాశ వ్యక్తం చేశారు. సెంచరీ చేసే అవకాశం వచ్చినప్పుడు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని సూచించారు. రోహిత్‌ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయానికి.. అతడి వయసు కంటే ఎక్కువ సెంచరీలు సాధించాలని గావస్కర్ ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 35 వన్డే సెంచరీలు ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ సమయానికి రోహిత్‌ వయసు 40 ఏళ్లకు చేరనుంది. వెస్టిండీస్‌పై మరో సెంచరీ చేసి ఉంటే ఈ ప్రత్యేక లక్ష్యానికి మరింత చేరువయ్యేవాడని గావస్కర్ అన్నారు.

తన కెరీర్ చివరి దశలో తాను కూడా మరిన్ని టెస్టు సెంచరీలు చేయాలని కోరుకున్నానని గావస్కర్ గుర్తుచేసుకున్నారు. మూడు సార్లు 90ల్లోనే ఔటయ్యానని, ఆ ఇన్నింగ్స్‌లను శతకాలుగా మలిచి ఉంటే.. 38 ఏళ్ల వయసులో రిటైర్ అయిన తనకు సెంచరీల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండేదని చెప్పారు. తాను సాధించలేకపోయిన ఆ ఘనతను రోహిత్ సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 2023 ప్రపంచకప్‌తో పోలిస్తే ప్రస్తుతం రోహిత్ బ్యాటింగ్ శైలిలో గణనీయమైన మార్పు కనిపిస్తోందని గావస్కర్ ప్రశంసించారు. అప్పట్లో తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్.. ఇప్పుడు తన వికెట్ విలువను తెలుసుకుని ఆరంభాలను భారీ స్కోర్లుగా మలుస్తున్నాడన్నారు. 70-80 బంతుల్లోనే సెంచరీ చేస్తే అది జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు రోహిత్‌ను ప్రభావితం చేయకూడదని గావస్కర్ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలలో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు

ఆసియా క్రీడలలో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా
ట్యాగ్లు
రోహిత్ శర్మసునీల్ గావస్కర్రోహిత్ శర్మ సెంచరీభారత్ వర్సెస్ వెస్టిండీస్మూడో వన్డేభారత క్రికెట్టీమ్‌ఇండియావన్డే క్రికెట్వన్డే ప్రపంచకప్ 2027రోహిత్ శర్మ రికార్డులు
Advertisement

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీఐ ఛార్జీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కె. నారాయణ
రాజకీయాలు

యూపీఐ ఛార్జీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కె. నారాయణ

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు
జనరల్

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..
జనరల్

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం
జనరల్

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..
జనరల్

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు
సినిమాలు

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..
సినిమాలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?
జనరల్

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు
బిజినెస్

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..
క్రీడలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..
క్రీడలు

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!