27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

Writer: Nithish 05:54 AM, 27 సెప్టెంబర్, 2026
విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

వన్డే ప్రపంచకప్‌కు మరో ఏడాది సమయం మాత్రమే ఉండటంతో టీమ్‌ఇండియా 50 ఓవర్ల మెగా టోర్నీకి సన్నాహాలను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. 2027 ప్రపంచకప్‌లో ఆడనున్నట్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ఆసియా క్రీడల్లో భారత టీ20 జట్టు బరిలోకి దిగుతున్న సమయంలోనే శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని వన్డే జట్టు విండీస్‌తో పోరుకు సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా తొలి వన్డే జరగనుంది. ఇంగ్లాండ్‌లో జులైలో వన్డేలు ఆడిన తర్వాత కోహ్లి, రోహిత్‌ ఈ సిరీస్‌తో మళ్లీ వన్డే బరిలోకి దిగుతున్నారు.

రోహిత్‌ శర్మతో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుండగా, విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో, రుతురాజ్‌ గైక్వాడ్‌ నాలుగో స్థానంలో ఆడే అవకాశం ఉంది. కేఎల్‌ రాహుల్‌ ఐదో స్థానంలో వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రవీంద్ర జడేజా నుంచి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది. కుల్‌దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. నితీశ్‌కుమార్‌ రెడ్డి పేస్‌ ఆల్‌రౌండర్‌గా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ కొత్త బంతిని పంచుకునే అవకాశం ఉంది. మరోవైపు షై హోప్‌ నేతృత్వంలోని విండీస్‌ జట్టులో రోస్టన్‌ చేజ్‌, జస్టిన్‌ గ్రీవ్స్‌, షెర్ఫానీ రూథర్‌ఫర్డ్‌ కీలక ఆటగాళ్లు. తిరువనంతపురం పిచ్‌ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరించే అవకాశముంది.
అంచనా తుది జట్లు:
భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, నితీశ్‌కుమార్‌ రెడ్డి, గుర్నూర్‌ బ్రార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌.

వెస్టిండీస్‌: జాన్‌ క్యాంప్‌బెల్‌, జస్టిన్‌ గ్రీవ్స్‌, కీసీ కార్టీ, షై హోప్‌ (కెప్టెన్‌), షెర్ఫానీ రూథర్‌ఫర్డ్‌, రోస్టన్‌ చేజ్‌, మాథ్యూ ఫోర్డ్‌, గుడాకేశ్‌ మోటీ, జేడెన్‌ సీల్స్‌, షమర్‌ జోసెఫ్‌, అల్జారి జోసెఫ్‌.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

ట్యాగ్లు
భారత్‌ వర్సెస్ వెస్టిండీస్‌వన్డే సిరీస్‌టీమ్‌ఇండియావిరాట్‌ కోహ్లిరోహిత్‌ శర్మశుభ్‌మన్‌ గిల్‌వెస్టిండీస్‌తిరువనంతపురంరవీంద్ర జడేజాక్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి
జనరల్

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
జనరల్

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా
జనరల్

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు
జనరల్

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం
బిజినెస్

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రకటన అపోహలకు తెరదించింది - చంద్రబాబు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రకటన అపోహలకు తెరదించింది - చంద్రబాబు

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌
క్రీడలు

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి - బి.వినోద్‌ కుమార్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి - బి.వినోద్‌ కుమార్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!