

2026 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఇండియా-ఏ జట్టుతో శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. అయితే దంబుల్లాలో జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్‌లో అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. శ్రీలంక-ఏపై 14, ఆఫ్ఘనిస్థాన్-ఏపై 44, మరోసారి శ్రీలంక-ఏపై 21 పరుగులు మాత్రమే చేశాడు.
టి20 ఫార్మాట్‌లోని ఫ్లాట్ వికెట్ల నుంచి వన్డే ఫార్మాట్‌లోని నెమ్మదైన శ్రీలంక పిచ్‌లకు మారడం యువ బ్యాటర్‌కు సవాలుగా మారిందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల శ్రీలంక ఆటగాళ్లతో జరిగిన స్వల్ప వాగ్వాదం కూడా చర్చనీయాంశమైంది. అయినప్పటికీ అతని ప్రతిభపై భారత సెలెక్టర్లు పూర్తి విశ్వాసం ఉంచుతున్నారు. ఇప్పటికే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం భారత సీనియర్ టీ20 జట్టులో చోటు దక్కడం అతనిపై ఉన్న నమ్మకాన్ని చాటుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!