

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమై, సమగ్ర భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నారు.
వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. మూడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయడంతో పాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఏఆర్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన సిబ్బందిని భారీగా మోహరిస్తున్నారు. గ్రీన్ కారిడార్, వీఐపీ పార్కింగ్, సభా ప్రాంగణ భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఆగస్టు 1 ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీపీ శంఖబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!