31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పసిడి మార్కెట్‌లో మారిన ట్రెండ్

Writer: Pooja 09:15 AM, 31 జులై, 2026
పసిడి మార్కెట్‌లో మారిన ట్రెండ్

భారత్‌లో పసిడి డిమాండ్‌కు గణనీయంగా బ్రేక్ పడింది. ప్రపంచ స్వర్ణ మండలి (WGC) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 131.4 టన్నులకు పడిపోయింది. ఇది గత ఆరేళ్లలో కనిష్ఠ స్థాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డిమాండ్ 6 శాతం తగ్గింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం, సీజనల్ డిమాండ్ బలహీనంగా ఉండటం, విదేశీ మారక నిల్వల పరిరక్షణ కోసం అవసరమైతే తప్ప బంగారం కొనొద్దన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని డబ్ల్యూజీసీ తెలిపింది.

అయితే పరిమాణం తగ్గినా, విలువ పరంగా మాత్రం బంగారం అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ.1.98 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 50 శాతం అధికం. అధిక ధరలు ఉన్నప్పటికీ వినియోగదారులు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారని డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం భారత బంగారం డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉండే అవకాశముందని ఆయన అంచనా వేశారు.

దిగుమతి సుంకాల పెంపుతో బంగారం స్మగ్లింగ్ కూడా పెరిగిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. మే 13 నుంచి జూన్ చివరి వరకు స్వాధీనం చేసుకున్న బంగారం గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అయింది. మరోవైపు నగల కోసం బంగారం వినియోగం 75.1 టన్నులకు తగ్గగా, పెట్టుబడుల కోసం కొనుగోలు మాత్రం 9 శాతం పెరిగి 50.3 టన్నులకు చేరింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా ఈ ఏడాది రెండో అర్థభాగంలో బంగారం డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌...భారీ ఆఫర్ల జాతర

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌...భారీ ఆఫర్ల జాతర

వ్యాపార రంగంలో మహిళల సత్తా

వ్యాపార రంగంలో మహిళల సత్తా

ఐటీఆర్‌ గడువు నేటితో ముగింపు

ఐటీఆర్‌ గడువు నేటితో ముగింపు

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

మోదీ పిలుపు ఎఫెక్ట్.. బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల

మోదీ పిలుపు ఎఫెక్ట్.. బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల

టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు

టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు

ట్యాగ్లు
బంగారం డిమాండ్ప్రపంచ స్వర్ణ మండలిబంగారం ధరలుభారత ఆర్థిక వ్యవస్థబంగారం మార్కెట్పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాధ వెనుక రితిక విజయ రహస్యం?
సినిమాలు

బాధ వెనుక రితిక విజయ రహస్యం?

సర్దార్ 2 విడుదలపై సందేహాలకు పూర్తి చెక్!
సినిమాలు

సర్దార్ 2 విడుదలపై సందేహాలకు పూర్తి చెక్!

అజయ్ భూపతి ముద్ర మిస్ అయ్యిందా?
సినిమాలు

అజయ్ భూపతి ముద్ర మిస్ అయ్యిందా?

నటిగా సింగర్‌గా శ్రీ గౌరీప్రియ డబుల్ హంగామా!
సినిమాలు

నటిగా సింగర్‌గా శ్రీ గౌరీప్రియ డబుల్ హంగామా!

వర్షాల ప్రభావం...ఎన్‌హెచ్-44పై రాకపోకలు నిలిపివేత
జనరల్

వర్షాల ప్రభావం...ఎన్‌హెచ్-44పై రాకపోకలు నిలిపివేత

గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒలెక్ట్రా సరికొత్త రికార్డు
జనరల్

గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒలెక్ట్రా సరికొత్త రికార్డు

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు థింసా కళాకారుల ఘన స్వాగతం
జనరల్

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు థింసా కళాకారుల ఘన స్వాగతం

ప్రధాని పర్యటనకు భారీ భద్రత - సీపీ శంఖబ్రత బాగ్చి
జనరల్

ప్రధాని పర్యటనకు భారీ భద్రత - సీపీ శంఖబ్రత బాగ్చి

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌...భారీ ఆఫర్ల జాతర
బిజినెస్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌...భారీ ఆఫర్ల జాతర

వ్యాపార రంగంలో మహిళల సత్తా
బిజినెస్

వ్యాపార రంగంలో మహిళల సత్తా

పసిడి మార్కెట్‌లో మారిన ట్రెండ్
బిజినెస్

పసిడి మార్కెట్‌లో మారిన ట్రెండ్

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సీఎం సంతాపం
రాజకీయాలు

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సీఎం సంతాపం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!