

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా వీడ్కోలు పలికింది. దాదాపు 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో భారత జట్టుకు అత్యంత నమ్మకమైన టెస్టు బ్యాటర్లలో ఒకరిగా రహానే నిలిచారని బీసీసీఐ కొనియాడింది. లార్డ్స్, వెల్లింగ్టన్, మెల్‌బోర్న్, కింగ్‌స్టన్, డర్బన్‌లలో సాధించిన శతకాలు విదేశీ గడ్డపై భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లుగా నిలిచాయని పేర్కొంది.
ప్రత్యేకంగా 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రహానే నాయకత్వాన్ని బీసీసీఐ ప్రశంసించింది. అడిలైడ్ టెస్టు తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఆయన, గాయాలతో సతమతమైన యువ జట్టును ముందుండి నడిపించి మెల్‌బోర్న్‌లో శతకం సాధించడమే కాకుండా, ది గబ్బాలో చారిత్రక విజయంతో ఆస్ట్రేలియాకు 32 ఏళ్ల అపరాజిత రికార్డుకు తెరదించారు. టెస్టు కెప్టెన్‌గా ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, రెండు డ్రాలతో అపరాజిత రికార్డును కొనసాగించిన రహానే సేవలను బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రశంసిస్తూ భారత క్రికెట్‌కు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!