

మంగళవారం విరామం అనంతరం మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) కీలక దశలోకి ప్రవేశించనుంది. మూడు రోజుల్లో ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో అమరావతి ఏ ఛాంపియన్స్ జట్టు వైజాగ్ ఫైర్‌బర్డ్స్‌తో తలపడనుంది. సాయంత్రం 6 గంటలకు జరిగే మరో పోరులో గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు రాయలసీమ జెన్ స్టార్స్‌తో పోటీపడనుంది. లీగ్ కీలక దశకు చేరుకోవడంతో ప్రతి మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికపై ప్రభావం చూపనుంది.
తొలి మూడు మ్యాచ్‌లు ముగిసే సమయానికి రాయలసీమ జెన్ స్టార్స్, అమరావతి ఏ ఛాంపియన్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు రెండేసి విజయాలు, ఒక ఓటమితో నాలుగు పాయింట్ల చొప్పున సాధించాయి. రన్‌రేట్‌లో రాయలసీమ (+0.643) ముందంజలో ఉండగా, అమరావతి (+0.383), గోదావరి (-0.164) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన వైజాగ్ ఫైర్‌బర్డ్స్ చివరి స్థానంలో ఉంది. టాప్-2లో నిలిచే జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనున్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌లు ప్రతి జట్టుకూ కీలకం. వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయితేనే రన్‌రేట్ తుది స్థానాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!