

ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ AI వినియోగదారుల్లో తాజాగా ప్రైవసీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ లింక్‌ల ద్వారా షేర్ చేసిన ఆర్టిఫాక్ట్స్ గూగుల్ సెర్చ్‌లో కనిపిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. షేర్ చేసిన చాట్‌లు ఎక్కువగా సెర్చ్ ఫలితాల నుంచి తొలగించబడినప్పటికీ, డాక్యుమెంట్లు, యాప్‌లు, స్ప్రెడ్‌షీట్లు, డ్యాష్‌బోర్డులు మరియు ఇతర AI రూపొందించిన కంటెంట్ ఇంకా సెర్చ్‌లో కనిపిస్తుండటం చర్చనీయాంశమైంది. దీంతో పబ్లిక్ షేరింగ్ ఫీచర్‌ను ఉపయోగించే సమయంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై స్పందించిన ఆంథ్రోపిక్, క్లాడ్‌లోని చాట్‌లు, ఆర్టిఫాక్ట్స్ అన్నీ డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా ఉంటాయని, వినియోగదారుడు స్వయంగా షేరబుల్ లింక్ రూపొందించినప్పుడు మాత్రమే అవి పబ్లిక్ అవుతాయని తెలిపింది. అలాగే సెర్చ్ ఇంజిన్‌లకు చాట్ డైరెక్టరీలు లేదా సైట్‌మ్యాప్‌లను అందించబోమని పేర్కొంది. అయితే కొన్ని పబ్లిక్ పేజీల్లో 'noindex' మెటాడేటా లేకపోవడం వల్ల అవి గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్‌లలో ఇండెక్స్ అయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచించాయి. ఇప్పటికే షేర్ చేసిన కంటెంట్‌ను వినియోగదారులు Privacy Settingsలోని Shared Chats విభాగంలో పరిశీలించి, అవసరం లేని పబ్లిక్ లింక్‌లను తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!