

మెటా తన కొత్త Meta VR Glassesను $1,299.99 ధరకు ఆవిష్కరించింది. 2027 వసంతకాలంలో అమెరికా మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఈ వీఆర్ గ్లాసెస్ సుమారు 100 గ్రాముల బరువు ఉంటాయి. సాధారణ కళ్లద్దాలను పోలిన డిజైన్‌తో 5K మైక్రో-OLED డిస్‌ప్లే, ప్యాన్‌కేక్ లెన్స్‌లు, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రాసెసర్, బ్యాటరీ, స్టోరేజీని ప్రత్యేకమైన కంప్యూట్ యూనిట్‌లో ఉంచారు.
ఈ గ్లాసెస్‌ను సినిమాలు చూడటం, గేమింగ్, పని కోసం వర్చువల్ మల్టీ-స్క్రీన్ ఏర్పాటు చేసుకోవడం వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కళ్ల కదలికలు, చేతి సంజ్ఞలు, వాయిస్ ద్వారా డివైజ్‌ను నియంత్రించేలా మెటా ఏఐను ఇందులో అనుసంధానించింది. 3డీ సినిమాలు, ఇమర్సివ్ స్పోర్ట్స్ వంటి వినోద సదుపాయాలతో పాటు సాధారణ టేబుల్‌ను కీబోర్డ్, టచ్‌ప్యాడ్‌గా ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది. భారత్‌లో విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!