

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఆకర్షణీయమైన ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.69,999 కాగా, ప్రస్తుతం రూ.39,999కే లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్ వర్తింపజేస్తే ధర రూ.35,149కు తగ్గుతుంది. అయితే బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఫోన్ డెలివరీ తర్వాత జమ కావచ్చు. అదనంగా రూ.199 ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999గా ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై గరిష్ఠంగా రూ.27,450 వరకు, ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆప్షన్ ద్వారా అదనంగా రూ.5,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఈ రెండు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కలిపి వినియోగించుకోలేరు.
ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హాలో యూఐపై రన్ అవుతుంది. వెనుకవైపు 50MP సోనీ LYTIA ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, ముందువైపు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ప్రత్యేక టెలిఫొటో కెమెరా మాత్రం లేదు. 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు IP68, IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి. డిస్‌ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌కు ప్రాధాన్యమిచ్చేవారికి ఈ ఫోన్ ఒక ఎంపికగా నిలవొచ్చు. అయితే కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత ధర, బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ నిబంధనలను పరిశీలించాలి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!