
రాజకీయాలు

ఎక్స్ తన వేదికపై పారదర్శకతను మరింత పెంచే దిశగా కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ పోస్టులు ఏయే ప్రాంతాల్లో అందుబాటులో లేవో లేదా నిషేధానికి గురయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. పోస్టుల విషయంలో ప్రాంతాల వారీగా అమలవుతున్న పరిమితులపై మరింత స్పష్టత కల్పించడమే దీని ఉద్దేశంగా తెలుస్తోంది.
ఎక్స్ అంతర్గతంగా అభివృద్ధి చేస్తున్న ‘అండర్ ది హుడ్’ ఫీచర్లో భాగంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు పోస్టుల వీక్షణలు, ప్రాంతాల వారీగా అమలయ్యే పరిమితులపై యూజర్లకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండేది కాదు. కొత్త ఫీచర్తో పోస్టులపై ఉన్న ప్రాంతీయ పరిమితులు, వాటి ప్రభావంపై యూజర్లు మరింత స్పష్టత పొందే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!