

వందేమాతరం గీతంలోని మొత్తం ఆరు చరణాలను తప్పనిసరిగా ఆలపించాలన్న నిబంధనను సవాల్ చేస్తూ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వందేమాతరం గీతాన్ని ఏ మేరకు ఆలపించాలన్న అంశం వ్యక్తిగత మనస్సాక్షి, స్వేచ్ఛకు సంబంధించినదని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వందేమాతరం ఆలాపనకు సంబంధించిన నిబంధనలను సవాల్ చేస్తూ టి.ఎం. కృష్ణ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
వందేమాతరంలోని అన్ని చరణాలను ఆలపించని వారిపై శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదన్న అంశాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి, రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వందేమాతరం గీతానికి సంబంధించిన చట్టపరమైన రక్షణ, పూర్తి గీతాన్ని ఆలపించాలన్న కేంద్రం ఆదేశాలపై తదుపరి విచారణ కొనసాగనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!