

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేసింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రం కేంద్రంగా పనిచేస్తున్న ఎంటర్‌ప్రైజ్ డేటా ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ సంస్థ స్లాష్‌బీఐ (SplashBI) ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు సోమవారం ఈ జీసీసీని ప్రారంభించారు. సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2014 నుంచే స్లాష్‌బీఐ హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్త కేంద్రం ద్వారా నగరంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని సంస్థ భావిస్తోంది.
వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ఈ కేంద్రం అభివృద్ధి, విస్తరణ కోసం 100 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు స్లాష్‌బీఐ ప్రకటించింది. ఈ పెట్టుబడితో హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ కంపెనీలు తమ సాంకేతిక, డేటా, వ్యాపార కార్యకలాపాల కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయనడానికి ఈ పరిణామం మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ జీసీసీ ఏర్పాటు కావడం నగర ఐటీ రంగానికి మరింత ప్రాధాన్యతను తీసుకొస్తోంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!