
సినిమాలు

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో నీటి సమస్య విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కొద్ది రోజులుగా క్యాంపస్‌లో తాగునీరు, ఇతర అవసరాలకు సరిపడా నీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికితోడు విద్యార్థుల వసతి గృహాల్లోని కుళాయిల నుంచి మురుగు నీరు వస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కలుషిత నీటి వినియోగం కారణంగా కొందరు విద్యార్థులు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించి, స్వచ్ఛమైన నీటిని అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి క్యాంపస్‌లో నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!