10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..సామాన్యులకు షాక్ తప్పదా?

Writer: Pooja 09:11 AM, 10 నవంబర్, 2026
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..సామాన్యులకు షాక్ తప్పదా?

దేశంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాల కంటే మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. డిసెంబరు 2 నుంచి 4 వరకు జరిగే సమావేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక రెపో రేటును 0.25 శాతం పెంచవచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో మరో 0.25 శాతం పెంపు ఉండొచ్చని అంచనా వేసింది. ఈ రెండు పెంపులు అమలైతే ప్రస్తుతం 5.5 శాతంగా ఉన్న రెపో రేటు 6 శాతానికి చేరుతుంది. ఆర్థిక పరిస్థితులను బట్టి 2027 ఏప్రిల్‌లో జరిగే సమావేశంలోనూ మరో 0.25 శాతం పెంపు ఉండే అవకాశాన్ని నివేదిక తోసిపుచ్చలేదు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తమ రుణాలు, ఇతర వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ఆర్‌బీఐ రెపో రేటు కీలక ప్రమాణంగా ఉంటుంది.

విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు పెరిగినా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో పెద్దగా కోలుకోవడం కనిపించకపోవచ్చని నివేదిక పేర్కొంది. ఫార్వర్డ్ ఫారెక్స్ మార్కెట్లో ఆర్‌బీఐ నెట్ డాలర్ షార్ట్ పొజిషన్ సుమారు 23,900 కోట్ల డాలర్లకు చేరడం రూపాయి బలపడేందుకు అడ్డంకిగా మారవచ్చని తెలిపింది. గత ఏడాది అక్టోబరులో దేశ విదేశీ మారక నిల్వలు సుమారు పది నెలల దిగుమతులకు సరిపడా ఉండగా, ఈ ఏడాది గత నెలాఖరు నాటికి అవి ఏడు నెలల దిగుమతులకు సరిపడే స్థాయికి తగ్గినట్లు నివేదిక వివరించింది. రానున్న సంవత్సరాల్లో దేశంలోకి వచ్చే డాలర్లను ఆర్‌బీఐ తన నిల్వల్లోకి తీసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే రూపాయి విలువ భారీగా పడిపోయే ప్రమాదం లేదని, 2026 డిసెంబరు నుంచి 2027 జూన్ మధ్య డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.92–96 మధ్య ఉండవచ్చని పేర్కొంది.

మరోవైపు భారత్‌కు కొంత ఊరట కలిగించేలా ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు సుమారు 102 డాలర్లుగా ఉండగా, వచ్చే ఐదు నెలల్లో అది 85 డాలర్లకు తగ్గవచ్చని తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే చమురు ధరలు మరింత భారీగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. చమురు ధరలు తగ్గితే భారత్ దిగుమతి బిల్లు, ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కొంత మేర తగ్గే అవకాశముంది. అయితే ఈ అంచనాలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పండుగ వేళ వినియోగదారుల జేబుకు చిల్లు

పండుగ వేళ వినియోగదారుల జేబుకు చిల్లు

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల..

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల..

విశాఖలో సీఐఐ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా, గోయల్, చంద్రబాబు

విశాఖలో సీఐఐ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా, గోయల్, చంద్రబాబు

జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్ హువాంగ్ పరిచయం.. గూఢచర్య ఆరోపణలతో కలకలం

జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్ హువాంగ్ పరిచయం.. గూఢచర్య ఆరోపణలతో కలకలం

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్..ఒక రీఛార్జ్‌తో మరో ప్లాన్ ఉచితం

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్..ఒక రీఛార్జ్‌తో మరో ప్లాన్ ఉచితం

ట్యాగ్లు
ఆర్‌బీఐ రెపో రేటువడ్డీ రేట్లుఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్రూపాయి విలువముడి చమురు ధరలుభారత ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై ఆరోపణలు.. భారీగా పడిపోయిన ఎన్విడియా షేర్లు
బిజినెస్

సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై ఆరోపణలు.. భారీగా పడిపోయిన ఎన్విడియా షేర్లు

పండుగ వేళ వినియోగదారుల జేబుకు చిల్లు
బిజినెస్

పండుగ వేళ వినియోగదారుల జేబుకు చిల్లు

వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..సామాన్యులకు షాక్ తప్పదా?
బిజినెస్

వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..సామాన్యులకు షాక్ తప్పదా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 డే 64: స్నేహితులుగా ఉన్న సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం.. నామినేషన్లలో రచ్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 డే 64: స్నేహితులుగా ఉన్న సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం.. నామినేషన్లలో రచ్చ

మహేశ్‌–రాజమౌళి ‘వారణాసి’కి భారీ డిమాండ్‌..
సినిమాలు

మహేశ్‌–రాజమౌళి ‘వారణాసి’కి భారీ డిమాండ్‌..

బాసర ట్రిపుల్ ఐటీలో మురుగు నీటి కలకలం
జనరల్

బాసర ట్రిపుల్ ఐటీలో మురుగు నీటి కలకలం

ఢిల్లీలో కొనసాగుతున్న ఎయిర్ ఎమర్జెన్సీ
జనరల్

ఢిల్లీలో కొనసాగుతున్న ఎయిర్ ఎమర్జెన్సీ

కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత
జనరల్

కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత

శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు.. దర్శన వేళల్లో కీలక మార్పులు!
జనరల్

శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు.. దర్శన వేళల్లో కీలక మార్పులు!

ఉలవలు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న విషయాలివే!
ఆరోగ్యం

ఉలవలు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న విషయాలివే!

దంతాల్లో క్యావిటీస్ రాకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి.. వైద్యుల సూచనలు!
ఆరోగ్యం

దంతాల్లో క్యావిటీస్ రాకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి.. వైద్యుల సూచనలు!

వలస విధానంపై వెనక్కి తగ్గిన ట్రంప్‌.. కఠిన వైఖరిపై కీలక వ్యాఖ్యలు!
రాజకీయాలు

వలస విధానంపై వెనక్కి తగ్గిన ట్రంప్‌.. కఠిన వైఖరిపై కీలక వ్యాఖ్యలు!

పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లిపై చర్చ..
గాసిప్స్

పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లిపై చర్చ..

భారత్–న్యూజిలాండ్ మూడో వన్డేకు వర్షం అంతరాయం.. ఆలస్యమైన టాస్!
క్రీడలు

భారత్–న్యూజిలాండ్ మూడో వన్డేకు వర్షం అంతరాయం.. ఆలస్యమైన టాస్!

షేక్ హసీనాకు బంగ్లాదేశ్ షాక్..
జనరల్

షేక్ హసీనాకు బంగ్లాదేశ్ షాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!