
జనరల్

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 పాయింట్ల మార్కును దాటడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారిపై కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)లోని మూడో దశ (గ్రాప్-III) ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాలుష్యాన్ని నియంత్రించేందుకు పలు కార్యకలాపాలపై పరిమితులు విధిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!