

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది. భారత ప్రమాణాల సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. ఈ నిర్ణయం దేశీయ బయో ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకుంది.
ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, రైతులకు ప్రయోజనం కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇథనాల్ ఆధారిత ఇంధనాల వినియోగం పెరగడం ద్వారా భవిష్యత్తులో ఇంధన వ్యయభారం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అంతకుముందు కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు ₹10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో డీజిల్ ఎగుమతులపై లీటరుకు ₹21.5, విమాన ఇంధన ఎగుమతులపై లీటరుకు ₹29.5 సుంకం విధించింది. మే 15 నుంచి చమురు కంపెనీలు నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచగా, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలపై అనిశ్చితి కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!