
సినిమాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో ట్రేడింగ్ రోజూ నష్టాలతోనే ముగిశాయి. పెరిగిన ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు, ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనల నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 332 పాయింట్లు (0.43%) క్షీణించి 76,059.77 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 102.15 పాయింట్లు (0.43%) పడిపోయి 23,767.45 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50లో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు అత్యధిక నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.10%, స్మాల్‌క్యాప్ 0.32% క్షీణించాయి. రంగాల వారీగా చూస్తే ఆటో సూచీ దాదాపు 1% పడిపోవడంతో అత్యధిక నష్టాన్ని నమోదు చేసింది. రియాల్టీ, ఫార్మా రంగాలు కూడా బలహీనంగా ఉండగా, మీడియా, ఐటీ రంగాల షేర్లు స్వల్ప లాభాలతో ముగిశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!