
జనరల్

తన వినియోగదార్లకు పార్సిళ్లను వేగంగా అందించేందుకు ఒక ఈ-కామర్స్ సంస్థ ఇండియా పోస్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంతో తపాలా విభాగానికి చెందిన 1.6 లక్షలకు పైగా పోస్టాఫీసుల విస్తృత నెట్‌వర్క్ సంస్థకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా డెలివరీ సామర్థ్యం పెరగడంతో పాటు, మరింత ఎక్కువ మంది వినియోగదారులకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపింది.
ఈ సేవల్లో ప్రీపెయిడ్, క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ), ఓటీపీ ఆధారిత డెలివరీ ధృవీకరణ, రియల్ టైమ్ షిప్‌మెంట్ ట్రాకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇదే తరహాలో గత డిసెంబర్‌లో అమెజాన్ ఇండియా కూడా తపాలా విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ భాగస్వామ్యాలు ఈ-కామర్స్ రంగంలో లాజిస్టిక్స్ మరియు లాస్ట్ మైల్ డెలివరీలను మరింత బలోపేతం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!