
షోస్

ప్రధాన రిటెయిల్ వ్యాపార సంస్థ డీమార్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.19,206.18 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16,218.79 కోట్లతో పోలిస్తే ఆదాయం 18.4 శాతం పెరిగింది. ఈ వివరాలను కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే డీమార్ట్ ఆదాయం 4.7 శాతం వృద్ధి చెందింది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ స్టోర్ల సంఖ్య 581కి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో డీమార్ట్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!