

దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా పలు మోడళ్ల ధరలను పెంచింది. పెరిగిన ముడిసరుకుల వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. కార్ల ధరలను సగటున 0.31 శాతం మేర పెంచగా, సవరించిన ధరలు నవంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కూడా సంస్థ మూడుసార్లు ధరలను పెంచింది. ఈ పెంపుల ద్వారా మొత్తం మీద ఒక శాతానికి పైగా ధరలు పెరిగాయి.
పెరిగిన ఉత్పత్తి వ్యయాల భారాన్ని పూర్తిగా వినియోగదారులపై వేయకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ, కొంత మేర ధరలను సవరించక తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిసరుకుల ధరలు పెరగడం సంస్థపై ప్రభావం చూపింది. రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు నమోదైనప్పటికీ, సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 26.36 శాతం తగ్గి రూ.2,466.1 కోట్లకు పరిమితమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!