

రిలయన్స్ జియో నెలవారీ వాలిడిటీ కోరుకునే వినియోగదారుల కోసం రూ.319, రూ.339 ధరలతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.319 ప్లాన్‌లో 18 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్, 5,000 జీబీ క్లౌడ్ స్టోరేజ్, జియో టీవీ, జియో ఏఐక్లౌడ్ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అదనపు 5జీ డేటా ప్రయోజనం ఇందులో లేదు.
రూ.339 ప్లాన్‌లోనూ అదే డేటా, కాలింగ్, ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలతో పాటు నెలవారీ వాలిడిటీ ఉంటుంది. రూ.319 ప్లాన్‌తో పోలిస్తే ఇందులో రూ.14.95 విలువైన అదనపు టాక్‌టైమ్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లోనూ గూగుల్ ఏఐ ప్రో, జియో టీవీ, జియో ఏఐక్లౌడ్ ప్రయోజనాలు ఉన్నాయి. రెండు ప్లాన్లు దేశవ్యాప్తంగా జియో టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉండగా, మైజియో యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!