

దేశీయ స్టాక్ మార్కెట్లు కుదుటపడుతున్న నేపథ్యంలో ఐపీఓల మార్కెట్ మళ్లీ ఉత్సాహంగా మారింది. అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల మొదట జంకిన కంపెనీలు ఇప్పుడు ప్రాథమిక మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. 2026 ద్వితీయార్ధం (జూలై–డిసెంబర్)లో 238 కంపెనీలు ఐపీఓలకు రానుండగా, మొత్తం రూ.4.72 లక్షల కోట్ల వరకు నిధులు సమీకరించనున్నాయి. ఇది ఇటీవలి కాలంలోనే అత్యధిక స్థాయి సమీకరణగా భావిస్తున్నారు.
ప్రథమార్ధంలో 27 కంపెనీలు రూ.22,555 కోట్లు సమీకరించగా, క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్, ఫ్రాక్టల్ అనలిటిక్స్, షాడోఫాక్స్ టెక్నాలజీస్ వంటి సంస్థలు ముందంజలో నిలిచాయి. ఇప్పటికే 174 కంపెనీలు భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ అనుమతులు పొందగా, మరిన్ని 64 కంపెనీలు వేచి ఉన్నాయి. దేశీయ మదుపర్ల పెట్టుబడులు, సిప్ ప్రవాహాలు, విదేశీ మదుపర్ల తిరిగి ప్రవేశం వల్ల మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది. జియో ప్లాట్‌ఫామ్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓలపై అధిక ఆసక్తి కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!