
జనరల్

అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతుండటంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నిన్న స్థిరంగా కొనసాగాయి. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,720గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,490గా నమోదైంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో బంగారం ధరలు ఒకే స్థాయిలో కొనసాగాయి. చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,450గా అత్యధికంగా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,870గా ఉంది.
మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గడంతో హైదరాబాద్, విజయవాడలో వెండి ధర రూ.2,59,900కు చేరుకుంది. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి కొనసాగిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!