

ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి అర్ధభాగంలో దేశీయ స్టాక్ మార్కెట్ మదుపరులకు నిరాశ ఎదురైంది. ఈ కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ 10.25 శాతం, నిఫ్టీ 50 సూచీ 8.66 శాతం మేర క్షీణించాయి. అయితే సెకండరీ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ, ఐపీఓ మార్కెట్ మాత్రం జోరుగా కొనసాగింది.
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 27 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.22,555 కోట్లు సమీకరించాయి. ప్రైమ్ డేటాబేస్ అంచనా ప్రకారం, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఐపీఓ మార్కెట్ మరింత వేగం పుంజుకోనుంది. మొత్తం 238 కంపెనీలు దాదాపు రూ.4.74 లక్షల కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి.
వీటిలో 174 కంపెనీలకు రూ.2.77 లక్షల కోట్ల సమీకరణకు సెబీ ఇప్పటికే అనుమతి ఇవ్వగా, మరో 64 కంపెనీలు రూ.1.95 లక్షల కోట్ల సమీకరణ కోసం అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ, రిలయన్స్ జియో ఐపీఓలతో పాటు ఎల్‌ఐసీ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) కోసం కూడా మదుపరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో 2026లో ఐపీఓ మార్కెట్ కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!