

2026-27 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికం (క్యూ1) కూడా భారత ఐటీ సేవల కంపెనీలకు ఆశించినంతగా కలిసిరాకపోవచ్చని ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఆదాయ వృద్ధి 1.7 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని, పెరిగినా అది 1.1 శాతాన్ని మించకపోవచ్చని అంచనా వేసింది.
టెక్నాలజీ పెట్టుబడులు, ఏఐ వినియోగంపై ఖాతాదారులలో స్పష్టత లేకపోవడంతో కొత్త ప్రాజెక్టులు, ఐటీ ఖర్చులు వాయిదా పడుతున్నాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఏఐ పెట్టుబడులపై సందిగ్ధత భారత ఐటీ కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపుతున్న ప్రధాన కారణాలుగా వెల్లడించింది.
పెద్ద ఐటీ కంపెనీల్లో విప్రోకు అత్యధిక ప్రభావం పడే అవకాశం ఉందని, టెక్ మహీంద్రా కూడా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని తెలిపింది. మరోవైపు పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్, ఇక్లర్‌ఎక్స్ వంటి మధ్యస్థాయి కంపెనీలు మెరుగైన వృద్ధిని నమోదు చేసే అవకాశముందని అంచనా వేసింది. దీర్ఘకాలంలో ఏఐ, ఎంటర్‌ప్రైజ్ డేటా ప్లాట్‌ఫార్మ్‌లకు పెరుగుతున్న డిమాండ్ ఐటీ రంగానికి ఊతమివ్వొచ్చని నివేదిక పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!