25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

Writer: Pooja 10:41 AM, 25 ఆగస్టు, 2026
క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో విషపూరిత దతూర (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి అనువైన ఆహార ఉత్పత్తులుగా విక్రయిస్తున్నట్లు గుర్తించిన కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలనా విభాగం కీలక చర్యలు తీసుకుంది. అమెజాన్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఫుడ్‌ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తాత్కాలికంగా నిలిపివేసింది. దతూర ఉత్పత్తుల ఆన్‌లైన్‌ విక్రయంపై ఫిర్యాదులు రావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో దతూర పండ్లు, విత్తనాలను ఆహార ఉత్పత్తులుగా చూపిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాకెట్లను గిడ్డంగుల్లో నిల్వ చేసి ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచినట్లు తేలింది. ‘థోర్న్‌ యాపిల్‌’గా పిలిచే దతూరలో సహజంగానే విషపూరిత ఆల్కలాయిడ్లు ఉంటాయని, శుద్ధి చేయని దతూరను తీసుకోవడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత సంస్థలు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని ఆహార భద్రతా విభాగం పేర్కొంది. అమెజాన్‌ తన వివరణను సమర్పించలేదని, ఇన్‌స్టామార్ట్‌ అదనపు సమయం కోరిందని అధికారులు తెలిపారు. మరోవైపు బిగ్‌బాస్కెట్‌ దతూర పండ్ల ఆన్‌లైన్‌ విక్రయాన్ని నిలిపివేసినట్లు వెల్లడించింది. దతూరను ఆహారంగా విక్రయిస్తున్న విక్రేతలు, సరఫరాదారుల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను కూడా నిలిపివేయాలని, మానవ వినియోగం కోసం ఉన్న అన్ని ఆన్‌లైన్‌ లిస్టింగ్‌లు, ప్రకటనలను తొలగించాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

ట్యాగ్లు
దతూరఆహార భద్రతక్విక్ కామర్స్కర్ణాటకడ్రగ్స్ విషప్రభావంఆన్‌లైన్ విక్రయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!
సినిమాలు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!