
జనరల్

అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త ఏఐ టెక్నాలజీతో రూపొందించిన కియా సొరెంటో కారు త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో ఈ కారును తయారు చేస్తున్నారు. సరికొత్త ఏఐ ఫీచర్లతో రూపొందించిన తొలి సొరెంటో కారు ఉత్పత్తి లైన్ నుంచి బయటకు వచ్చిందని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గ్వాంగులీ తెలిపారు.
కియా సొరెంటోను సెప్టెంబర్ 4న అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కియా ఇండియా డీలర్‌షిప్‌లతో పాటు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్స్‌కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అధునాతన టెక్నాలజీ, ఏఐ ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మోడల్‌పై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!