

వివాహేతర సంబంధాల వివాదం నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా పలువురు ఉద్యోగులు, ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఆయనను తిరిగి సంస్థ సీఈఓగా నియమించాలని కోరుతూ ఉద్యోగులు పిటిషన్ చేపట్టినట్లు సమాచారం. ఈ డిమాండ్‌కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా మద్దతు తెలిపారు. జెన్సన్ తిరిగి బాధ్యతలు చేపట్టాలని కోరుతూ పిటిషన్ వస్తే తాను సంతకం చేస్తానని పేర్కొన్నారు. ఒకవేళ ఎన్విడియా బోర్డు ఆయనను తిరిగి నియమించకపోతే, తన కంపెనీలో ఉద్యోగం కల్పించేందుకు సిద్ధమని మస్క్ వెల్లడించారు. జెన్సన్‌ను తమ సంస్థలో చేర్చుకోవడం గౌరవంగా భావిస్తానని అన్నారు.
మరోవైపు, జెన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన సీఈఓ స్థానానికి శాశ్వత వారసుడిని ఎంపిక చేసేందుకు ఎన్విడియా బోర్డు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి కంపెనీ CFO కోలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓ రెనే హాస్ పేరు వారసుడి రేసులో వినిపించినప్పటికీ, కంపెనీ అధికారికంగా ఆయనను ఎంపిక చేయలేదు. ఇదిలా ఉండగా, అలిస్ హువాంగ్‌తో జెన్సన్‌కు ఉన్న సంబంధాలపై అమెరికా నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆమెకు చైనా గూఢచర్య సంస్థలతో సంబంధాలున్నాయనే అనుమానాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!