

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి నియామకంపై నెలకొన్న ఉత్కంఠకు ఏఐసీసీ తెరదించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్‌ను నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటించారు. ఇప్పటివరకు తెలంగాణ ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో ఆమె స్థానంలో ఈ మార్పు చేపట్టారు. పార్టీకి ఆమె అందించిన సేవలను అధిష్ఠానం ప్రశంసించింది.
కొత్త ఇన్‌ఛార్జి ఎంపికపై కొంతకాలంగా పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగింది. ఈ పదవికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మాణిక్‌రావు ఠాక్రే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చివరకు అధిష్ఠానం బీఎం సందీప్ వైపు మొగ్గుచూపింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలు, రాజకీయ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలు ఆయన చేపట్టనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!