

దీర్ఘకాలంలో సంపదను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 293 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ పనితీరును ETMutualFunds విశ్లేషించగా, 9 స్కీమ్స్ సిప్ పెట్టుబడులపై 30 శాతానికి పైగా రాబడి అందించాయి. వీటిలో 8 స్మాల్ క్యాప్ ఫండ్స్ కాగా, ఒకటి ఫోకస్డ్ ఫండ్. మొత్తం 293 ఫండ్స్‌లో 182 స్కీమ్స్ పాజిటివ్ రాబడులు ఇవ్వగా, 83 ఫండ్స్ డబుల్ డిజిట్ రిటర్న్స్ అందించాయి. మరో 111 ఫండ్స్ సిప్ పెట్టుబడులపై నెగెటివ్ రాబడులు ఇచ్చాయి.
ఈ జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 45.95 శాతం సిప్ రాబడితో అగ్రస్థానంలో నిలిచింది. నెలకు రూ.10 వేల చొప్పున సిప్ చేసిన పెట్టుబడి సుమారు రూ.1.46 లక్షలకు చేరినట్లు విశ్లేషణ పేర్కొంది. ఆ తర్వాత ట్రస్ట్ఎంఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 41.53 శాతం రాబడితో ఉంది. మోతీలాల్ ఓస్వాల్ ఫోకస్డ్ ఫండ్ 38.30 శాతం, హీలియోస్ స్మాల్ క్యాప్ ఫండ్ 38.17 శాతం, మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ 35 శాతం రాబడిని అందించాయి. ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 34.78 శాతం, యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ 33.24 శాతం, ఎల్ఐసీ ఎంఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 32.44 శాతం, జేఎం స్మాల్ క్యాప్ ఫండ్ 31.29 శాతం రాబడిని నమోదు చేశాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!