
జనరల్

జెప్టోకు సంబంధించిన ఓ ఇంటర్న్‌షిప్ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ పోస్టులో బీటెక్, బీబీఏ, బీసీఏ, బీకామ్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే జాబ్ పోస్టులోని ‘స్కిల్స్ రిక్వైర్డ్’ విభాగంలో అభ్యర్థులు 20 కిలోల వరకు బరువు ఎత్తగలగాలని నిబంధన ఉండటం చర్చకు దారితీసింది. దీంతో ఈ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన అర్హతలపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
అంతేకాకుండా, వేగంగా జరిగే పని వాతావరణంలో రోజుకు 10 నుంచి 12 గంటల పాటు నిలబడి పనిచేయగల సామర్థ్యం ఉండాలని పోస్టులో పేర్కొన్నారు. ఈ వివరాలపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. ఇంటర్న్‌షిప్ పోస్టులో విద్యార్హతలతో పాటు ఇలాంటి శారీరక సామర్థ్యాలను ఎందుకు ప్రస్తావించారంటూ చర్చిస్తున్నారు. ఈ ఇంటర్న్‌షిప్ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!