

బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ E3 ఎలక్ట్రిక్ ఏఐ భారత మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ3 ఎలక్ట్రిక్ ఏఐ ట్రయాన్ను విడుదల చేసింది. కుటుంబ అవసరాలు, రోజువారీ నగర ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కూటర్‌కు పరిచయ ధరను రూ.1 లక్ష (బెంగళూరు ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. తొలుత బెంగళూరులో బుకింగ్స్ ప్రారంభించి, అనంతరం దేశంలోని ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది.
ఈ3 ట్రయాన్‌ను C1, C1X, C2 అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. C1 ధర రూ.1 లక్ష, C1X ధర రూ.1,09,999, C2 ధర రూ.1,19,999 (ఎక్స్-షోరూమ్). C1 ఒకసారి ఛార్జ్ చేస్తే 108 కి.మీ, C1X 165 కి.మీ, C2 128 కి.మీ వరకు IDC రేంజ్ అందిస్తుంది. C2 వేరియంట్ గంటకు 82 కి.మీ గరిష్ఠ వేగంతో పాటు స్పోర్ట్ మోడ్‌ను కూడా అందిస్తోంది.
ఏఐ ఫీచర్లు, భారీ స్టోరేజ్ ప్రత్యేకత
ఈ స్కూటర్‌లో ఏఐ ఆధారిత బ్యాటరీ హెల్త్ మానిటరింగ్, రిమోట్ వెహికల్ మానిటరింగ్, కనెక్టెడ్ నావిగేషన్, SOS అసిస్టెన్స్, డాష్‌క్యామ్ ఫంక్షన్, జియో ఫెన్సింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 5 అంగుళాల డిస్‌ప్లే, 14 అంగుళాల చక్రాలు, IP67 రేటింగ్, ఎల్‌ఈడీ లైటింగ్‌తో పాటు మొత్తం 52 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని కూడా కంపెనీ అందించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!