21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

Writer: Nithish 02:59 PM, 21 సెప్టెంబర్, 2026
క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

కేరళలో అరుదైన రాజకీయ సౌహార్దానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. పూంజార్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.జె. సెబాస్టియన్‌ తన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఎల్‌డీఎఫ్‌ నేత సెబాస్టియన్‌ కులత్తుంకల్‌ను ఎరుమేలిలో కొత్తగా నిర్మించిన అమక్కున్ను వంతెన ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. వాజక్కల, అమక్కున్ను ప్రాంతాలను కలిపే ఈ వంతెన నిర్మాణానికి కులత్తుంకల్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.80 లక్షలు మంజూరయ్యాయి. అనంతరం యూడీఎఫ్‌ ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయింది.

వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్యే కులత్తుంకల్‌కే ఈ ప్రాజెక్టు పూర్తి క్రెడిట్‌ దక్కుతుందని ఎం.జె. సెబాస్టియన్‌ పేర్కొన్నారు. తాను కేవలం పనులు పూర్తయ్యేలా పరిపాలనా పరంగా సహకరించానని తెలిపారు. అంతేకాదు, ప్రారంభోత్సవ శిలాఫలకంపై తన పేరు లేకుండా కేవలం ‘పూంజార్ ఎమ్మెల్యే’ అని మాత్రమే నమోదు చేయించారు. రాజకీయ ప్రయోజనాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన ఈ నిర్ణయంపై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌ కూడా ప్రశంసలు వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!

ట్యాగ్లు
ఎం.జె. సెబాస్టియన్సెబాస్టియన్ కులత్తుంకల్పూంజార్ ఎమ్మెల్యేకేరళ రాజకీయాలుఅమక్కున్ను వంతెనఎరుమేలిరాజకీయ సౌహార్దంఅభివృద్ధి రాజకీయాలుకాంగ్రెస్ఎల్‌డీఎఫ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!
క్రీడలు

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ
క్రీడలు

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!
రాజకీయాలు

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.
రాజకీయాలు

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...
సినిమాలు

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..
సినిమాలు

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్
బిజినెస్

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం
రాజకీయాలు

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!
జనరల్

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం
జనరల్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌
జనరల్

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!