21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

Writer: Nithish 03:06 PM, 21 సెప్టెంబర్, 2026
జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

2026 ఏషియన్ గేమ్స్‌కు ముందు భారత క్రికెట్ జట్టు జపాన్ చేరుకుంది. పురుషుల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. భారత్ సెప్టెంబర్ 28న తన మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు జపాన్‌తో సుజుకి కప్ పేరుతో ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, జపాన్ పురుషుల జట్లు తొలిసారి తలపడనుండటంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఏషియన్ గేమ్స్‌కు ముందు భారత ఆటగాళ్లకు ఇది సన్నాహక మ్యాచ్‌గా ఉపయోగపడనుంది.

జపాన్‌తో టీ20లో పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉండటంతో యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. అభిషేక్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్ తర్వాతి స్థానాల్లో ఆడవచ్చు. అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ పేస్ బాధ్యతలు చేపట్టగా.. రవి బిష్ణోయ్ స్పిన్ విభాగాన్ని నడిపించే అవకాశం ఉంది. జపాన్ పర్యటనలో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

భారత్ అంచనా తుది జట్టు: వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

ఆసియా క్రీడలు 2026: 36 ఏళ్ల వయసులో సుచిక తరియాల్ చరిత్ర..

ఆసియా క్రీడలు 2026: 36 ఏళ్ల వయసులో సుచిక తరియాల్ చరిత్ర..

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

ట్యాగ్లు
భారత క్రికెట్ జట్టుభారత్ జపాన్ టీ20ఏషియన్ గేమ్స్ 2026జపాన్ టీ20సుజుకి కప్వైభవ్ సూర్యవంశీసంజు శాంసన్వీవీఎస్ లక్ష్మణ్టీమిండియాభారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’.. నాని షేర్ చేసిన పోస్టర్!
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’.. నాని షేర్ చేసిన పోస్టర్!

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!
క్రీడలు

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ
క్రీడలు

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!
రాజకీయాలు

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.
రాజకీయాలు

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...
సినిమాలు

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..
సినిమాలు

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్
బిజినెస్

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం
రాజకీయాలు

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!
జనరల్

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం
జనరల్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!