

ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఒకే పోస్టులో ఎన్ని ఫొటోలు లేదా వీడియోలు ఉన్నా వాటికి ఒకే క్యాప్షన్ మాత్రమే జోడించే అవకాశం ఉండేది. దీంతో ప్రతి స్లైడ్‌కు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా చెప్పలేకపోతున్నామని యూజర్లు భావించేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్‌స్టాగ్రామ్ ‘మల్టీపుల్ క్యాప్షన్స్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఒకే పోస్టులోని ప్రతి ఫొటో లేదా వీడియో స్లైడ్‌కు వేర్వేరు క్యాప్షన్లు జోడించవచ్చు. యూజర్లు స్లైడ్లను స్వైప్ చేస్తున్నప్పుడు ఆయా ఫొటోలు లేదా వీడియోలకు సంబంధించిన క్యాప్షన్లు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రొడక్ట్ ప్రమోషన్లు చేసే వ్యాపారాలు, ఫుడ్ రివ్యూవర్లు, ట్రావెల్ వ్లాగర్లు మరియు కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది. ఈ ఫీచర్‌ను భారత్‌లో దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!