17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు బ్రేక్

Writer: Pooja 02:17 PM, 17 ఆగస్టు, 2026
కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు బ్రేక్

కొత్తగా ఇల్లు తీసుకున్న వారు, అద్దెకు మారిన కుటుంబాలు, కొత్తగా పెళ్లైన జంటలు ఎల్‌పీజీ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా.. అనేక ప్రాంతాల్లో అవి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై ఒత్తిడి, ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో చమురు సంస్థలు ప్రస్తుతం ఉన్న వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో కొత్త డొమెస్టిక్‌ ఎల్‌పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపులు తాత్కాలికంగా పరిమితమయ్యాయి. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా మాత్రం కొనసాగుతోంది.

దేశీయ ఉత్పత్తిపై కేంద్రం దృష్టి

భారత్‌ తన ఎల్‌పీజీ అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. అంతర్జాతీయ సరఫరా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలు, చమురు సంస్థలను ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్‌ సంస్థలు కలిసి రోజుకు 63,810 టన్నుల వరకు ఎల్‌పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సిద్ధంగా ఉంచేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశంలో రోజువారీ ఎల్‌పీజీ వినియోగం 90 వేల టన్నులకు పైగా ఉన్న నేపథ్యంలో నిల్వలపైనా దృష్టి సారించింది.

కొత్త కనెక్షన్లు ఎప్పటి నుంచి?

ఇండేన్‌, భారత్‌గ్యాస్‌, హెచ్‌పీ గ్యాస్‌ డీలర్ల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగించడమే ప్రధాన ప్రాధాన్యత. అందుకే కొత్త డొమెస్టిక్‌, డబుల్‌ సిలిండర్‌ కనెక్షన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నారు. ఒకే చిరునామాలో ఉన్న బహుళ కనెక్షన్లను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కొత్త కనెక్షన్ల పునఃప్రారంభ తేదీని చమురు సంస్థలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతర్జాతీయ సరఫరాలు మెరుగుపడి, దేశీయ నిల్వలు స్థిరపడిన తర్వాత దశలవారీగా కొత్త కనెక్షన్లు మళ్లీ ఇచ్చే అవకాశం ఉందని రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుదారులు ఆధార్‌, చిరునామా ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకుని, సమీప గ్యాస్‌ ఏజెన్సీ వద్ద తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాట్సాప్‌లో పాన్‌, ఆధార్‌ పంపుతున్నారా? జాగ్రత్త!

వాట్సాప్‌లో పాన్‌, ఆధార్‌ పంపుతున్నారా? జాగ్రత్త!

పెరిగిన బంగారం ధరలు...

పెరిగిన బంగారం ధరలు...

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
ఎల్‌పీజీఎల్‌పీజీ కనెక్షన్గ్యాస్ సిలిండర్ఇంధన సరఫరాఎల్‌పీజీ కొరతఇంధన సంక్షోభం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ అణు బాంబుపై ఫేక్ న్యూస్..
జనరల్

ఇరాన్ అణు బాంబుపై ఫేక్ న్యూస్..

సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు
జనరల్

సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

ఐపీఎల్‌ ట్రేడ్స్‌పై గావస్కర్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఐపీఎల్‌ ట్రేడ్స్‌పై గావస్కర్ కీలక వ్యాఖ్యలు

రాజధాని గ్రామాల్లో దుస్థితిని బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్
జనరల్

రాజధాని గ్రామాల్లో దుస్థితిని బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్

వాట్సాప్‌లో పాన్‌, ఆధార్‌ పంపుతున్నారా? జాగ్రత్త!
బిజినెస్

వాట్సాప్‌లో పాన్‌, ఆధార్‌ పంపుతున్నారా? జాగ్రత్త!

విజయ్ ‘డమ్మీ సీఎం’: ఉదయనిధి స్టాలిన్
రాజకీయాలు

విజయ్ ‘డమ్మీ సీఎం’: ఉదయనిధి స్టాలిన్

శ్రీలంక బ్యాటింగ్‌ను కుదిపేసిన టీమిండియా
క్రీడలు

శ్రీలంక బ్యాటింగ్‌ను కుదిపేసిన టీమిండియా

బాక్సాఫీస్ వద్ద వరుణ్ తేజ్ జోరు...
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద వరుణ్ తేజ్ జోరు...

కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు బ్రేక్
బిజినెస్

కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు బ్రేక్

రోహిత్ కోసం ఒడిశా నుంచి ముంబైకి సైకిల్ యాత్ర
జనరల్

రోహిత్ కోసం ఒడిశా నుంచి ముంబైకి సైకిల్ యాత్ర

‘వందే మాతరం’ను జాతీయ గీతంగా చేయాలి: ముకేశ్ ఖన్నా
జనరల్

‘వందే మాతరం’ను జాతీయ గీతంగా చేయాలి: ముకేశ్ ఖన్నా

దక్షిణ కొరియాకు ట్రంప్ షాక్..
జనరల్

దక్షిణ కొరియాకు ట్రంప్ షాక్..