

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు కొత్త ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లతో ఉచిత ప్రమాద బీమాతో పాటు సైబర్ ఫ్రాడ్ కవరేజీని అందిస్తోంది. ఇందుకోసం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో బీఎస్‌ఎన్‌ఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. STV 202, STV 2449 ప్లాన్లపై ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.లక్ష వరకు బీమా, అర్హత కలిగిన సైబర్ మోసాల వల్ల కలిగే నష్టాలకు రూ.10 వేల వరకు కవరేజీ లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
STV 202 ప్లాన్‌లో 300 నిమిషాల వాయిస్ కాల్స్, 5 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, 30 రోజుల వ్యాలిడిటీ ఉన్నాయి. STV 2449 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను అందిస్తుంది. ఈ బీమా ఆధారిత సదుపాయం అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. అర్హత కలిగిన రీఛార్జ్ చేసిన తర్వాత బీమా సదుపాయం ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. పాలసీ వివరాలను ఎస్సెమ్మెస్ ద్వారా వినియోగదారులకు పంపిస్తారు. కవరేజీకి బీమా సంస్థ నిబంధనలు వర్తిస్తాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!