

దేశీయ టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నప్పటికీ, ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాల విషయంలో వ్యూహాన్ని మార్చుకున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఫౌండ్‌ఇట్’ నివేదిక ప్రకారం, టెక్ రిక్రూట్‌మెంట్ డిమాండ్ ఏటా 10 శాతం పెరిగినా, సంప్రదాయ ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకాల వాటా 32 శాతం నుంచి 24 శాతానికి పడిపోయింది. దీంతో ఎంట్రీ-లెవెల్ ఐటీ ఉద్యోగాల్లో దాదాపు పావు వంతు తగ్గుదల నమోదైంది.
ఆటోమేషన్, కృత్రిమ మేధ (AI) విస్తరణతో ఫ్రెషర్లు చేసే ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్ పనులను ఇప్పుడు ఏఐ సాధనాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు బ్యాంకింగ్, హెల్త్‌కేర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు టెక్ గ్రాడ్యుయేట్లను అధికంగా నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం కంపెనీలు 7-10 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో, అభ్యర్థులు ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!