
బిజినెస్

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) కార్యకలాపాలకు ముగింపు పలుకుతూ ఢిల్లీ హైకోర్టు బ్యాంకును మూసివేయాలని ఆదేశించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వెల్లడించింది. నిబంధనల ఉల్లంఘనతో పాటు డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్నాయని పేర్కొంటూ ఆర్‌బీఐ ఇప్పటికే పీపీబీఎల్ బ్యాంకింగ్ లైసెన్సును రద్దు చేసింది.
తాజా హైకోర్టు ఆదేశాలతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేయనుంది. ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు అనుబంధ సంస్థగా ఉన్న పీపీబీఎల్‌పై నియంత్రణ చర్యలు తీసుకున్న అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!