

ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కనుంది. ప్రస్తుతం DV4గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను తమిళ, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ, శిరీష కూరపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ చిత్రానికి అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అంతకంటే ముందుగా సెప్టెంబర్ 23న ధ్రువ్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రకటన చేయనున్నారు. ఆ రోజున సినిమా అధికారిక టైటిల్‌తో పాటు పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో పెన్ స్టూడియోస్ ఆధ్వర్యంలో, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్వీ స్టూడియోస్ బ్యానర్లపై ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ రూపొందుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!