26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేవైసీ నిబంధనల్లో సెబీ కీలక మార్పులు

Writer: Nithish 07:19 AM, 26 నవంబర్, 2026
కేవైసీ నిబంధనల్లో సెబీ కీలక మార్పులు

మదుపర్లు ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభించే ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, పత్రాలను పదేపదే సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు సెబీ కేవైసీ నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించింది. మార్కెట్‌ ఇంటర్మీడియరీస్‌ మధ్య క్లయింట్ల సమాచారాన్ని సమర్థంగా పంచుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం, బ్రోకరేజీ సంస్థలు, డిపాజిటరీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్ల వంటి సంస్థలకు ఉమ్మడిగా అవసరమైన క్లయింట్ల అనుబంధ వివరాలను కేవైసీ రిజిస్ట్రేషన్‌ ఏజెన్సీ (కేఆర్‌ఏ) వద్ద భద్రపరుస్తారు. ఖాతా ప్రారంభ దరఖాస్తులోని రెండో భాగంలో మదుపర్లు ఈ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. సెంట్రల్‌ కేవైసీ ఐడెంటిఫైయర్‌, డిజిటల్‌ పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌, అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రాల గడువు వంటి అదనపు సమాచారాన్ని కూడా సంబంధిత సంస్థలు వ్యవస్థలో అప్‌లోడ్‌ చేయాలి. కేఆర్‌ఏ, సీకేవైసీఆర్‌ఆర్‌ నుంచి వివరాల్లో మార్పులు అందిన వెంటనే క్లయింట్ల రికార్డులను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్లను మినహాయించి ఇతర ఇంటర్మీడియరీస్‌ ఖాతా మూసివేత వివరాలను ఐదు పనిదినాల్లోగా తెలియజేయాలి. ఆ సమాచారం అందిన రెండు పనిదినాల్లోగా కేఆర్‌ఏ సంబంధిత రికార్డులను అప్‌డేట్‌ చేయాలి.

మ్యూచువల్‌ ఫండ్ల విషయంలోనూ సెబీ ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది. ఒక క్లయింట్‌ ఫోలియోలో వరుసగా ఆరు నెలల పాటు ఎలాంటి లావాదేవీలు లేదా పెట్టుబడులు లేకుండా బ్యాలెన్స్‌ సున్నాగా ఉంటే, ఫండ్‌ హౌస్‌ లేదా రిజిస్ట్రార్‌, ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్‌ (ఆర్‌టీఏ) ఐదు పనిదినాల్లోగా కేఆర్‌ఏకు సమాచారం అందించాలి. అనంతరం సంబంధిత ఫోలియోకు సంబంధించిన అప్‌డేట్లను కేఆర్‌ఏ మ్యూచువల్‌ ఫండ్‌ లేదా ఆర్‌టీఏతో పంచుకోవడం నిలిపివేస్తుంది. అలాగే, ఏదైనా ఇంటర్మీడియరీ నుంచి క్లయింట్‌ రికార్డును డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పటికీ 21 పనిదినాల్లోగా ఖాతా ప్రారంభించకపోతే, ఆ రికార్డును తొలగించే విషయాన్ని తదుపరి ఐదు పనిదినాల్లోగా సెబీకి తెలియజేయాలి. మరోవైపు, దరఖాస్తుల పరిశీలన కోసం నియంత్రిత వాతావరణంలో ఏఐ శాండ్‌బాక్స్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలిపారు. సెక్యూరిటీస్‌ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఏఐ సాధనాలను అందుబాటులోకి తెచ్చేందుకు దేశీయంగా నిర్వహించే ఏఐ నమూనాను అభివృద్ధి చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పసిడి, వెండి ధరలకు మళ్లీ తగ్గుదల

పసిడి, వెండి ధరలకు మళ్లీ తగ్గుదల

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు

దీపావళి వేళ క్విక్‌ కామర్స్‌ జోరు..

దీపావళి వేళ క్విక్‌ కామర్స్‌ జోరు..

పసిడి దిగుమతులకు బ్రేక్.. భారీగా తగ్గిన కొనుగోళ్లు

పసిడి దిగుమతులకు బ్రేక్.. భారీగా తగ్గిన కొనుగోళ్లు

ట్యాగ్లు
సెబీకేవైసీ నిబంధనలుమదుపర్లుస్టాక్ మార్కెట్‌డీమ్యాట్ ఖాతాట్రేడింగ్ ఖాతాకేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీమ్యూచువల్ ఫండ్లుఏఐ శాండ్‌బాక్స్‌తుహిన్ కాంత పాండే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు ప్రజా రవాణానే శాశ్వత పరిష్కారం: లండన్ నిపుణుడు
జనరల్

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు ప్రజా రవాణానే శాశ్వత పరిష్కారం: లండన్ నిపుణుడు

పసిడి, వెండి ధరలకు మళ్లీ తగ్గుదల
బిజినెస్

పసిడి, వెండి ధరలకు మళ్లీ తగ్గుదల

కేవైసీ నిబంధనల్లో సెబీ కీలక మార్పులు
బిజినెస్

కేవైసీ నిబంధనల్లో సెబీ కీలక మార్పులు

ముంబయి 26/11 ఉగ్రదాడుల జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోని విషాదం
జనరల్

ముంబయి 26/11 ఉగ్రదాడుల జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోని విషాదం

హసీనా అప్పగింతపై భారత్‌ పరిశీలన
జనరల్

హసీనా అప్పగింతపై భారత్‌ పరిశీలన

రాజ్యాంగ విలువలే వికసిత భారత్‌కు పునాది: ప్రధాని మోదీ
జనరల్

రాజ్యాంగ విలువలే వికసిత భారత్‌కు పునాది: ప్రధాని మోదీ

యూపీ సీఎం అభ్యర్థిపై యోగి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

యూపీ సీఎం అభ్యర్థిపై యోగి కీలక వ్యాఖ్యలు

దలైలామా తదుపరి వారసుడి ఎంపికలో చైనా జోక్యం వద్దు
జనరల్

దలైలామా తదుపరి వారసుడి ఎంపికలో చైనా జోక్యం వద్దు

అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లకు జనం క్యూ
జనరల్

అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లకు జనం క్యూ

అమెరికా నిఘా సంస్థలపై సైబర్‌ దాడి.. డేటా చోరీపై ఆందోళన
జనరల్

అమెరికా నిఘా సంస్థలపై సైబర్‌ దాడి.. డేటా చోరీపై ఆందోళన

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల
రాజకీయాలు

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!