

దేశంలో జూలై 2026 నెలకు సంబంధించిన స్థూల జీఎస్‌టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15.4 శాతం పెరిగి ₹2,11,205 కోట్లకు చేరాయి. జూలై 2025లో ఈ మొత్తం ₹1,83,065 కోట్లుగా నమోదైంది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్‌టీ ఆదాయం 10.1 శాతం, దిగుమతులపై వసూలైన జీఎస్‌టీ 28.8 శాతం పెరగడం విశేషం.
రిఫండ్‌లను మినహాయించిన తర్వాత నికర జీఎస్‌టీ ఆదాయం ₹1,81,237 కోట్లుగా నమోదై, గత ఏడాదితో పోలిస్తే 15.8 శాతం వృద్ధి సాధించింది. మొత్తం రిఫండ్‌లు ₹29,968 కోట్లుగా నమోదై, అవి కూడా 13.1 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. జూలై నెలలో రాష్ట్రం ₹5,819 కోట్ల జీఎస్‌టీ ఆదాయం నమోదు చేసి, గత ఏడాదితో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధించింది. అలాగే ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రానికి లభించిన పోస్ట్ సెటిల్‌మెంట్ SGST ఆదాయం ₹17,437 కోట్లకు చేరి 20 శాతం పెరుగుదల నమోదు చేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!