

అనవసర వాణిజ్య కమ్యూనికేషన్లు (UCC), స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అనుమానాస్పద స్పామ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న నంబర్లను గుర్తించేందుకు ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగించనున్నారు. స్పామ్‌కు ఎక్కువ అవకాశమున్న నంబర్ల వివరాలను టెలికాం ఆపరేటర్లు పరస్పరం పంచుకోవాల్సి ఉంటుంది. ఒకే పంపినవారికి సంబంధించిన పలు నంబర్లు అనుమానాస్పదంగా గుర్తిస్తే అదనపు వెరిఫికేషన్ చర్యలు చేపట్టేందుకు కొత్త వ్యవస్థ అవకాశం కల్పిస్తోంది.
ఆటోమేటెడ్ కమర్షియల్ కాల్స్‌పైనా ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. యాప్, సాఫ్ట్‌వేర్ లేదా ఆటోమేటెడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా చేసే ఆటోడయల్ కాల్స్, రోబోకాల్స్, ముందుగా రికార్డ్ చేసిన సందేశాలు, కృత్రిమ లేదా రికార్డ్ చేసిన వాయిస్‌తో చేసే కాల్స్ ఈ పరిధిలోకి వస్తాయి. ఇటువంటి సేవలను ఉపయోగించే సంస్థలు తమ టెలికాం ప్రొవైడర్‌కు ముందుగా వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనలకు కఠిన చర్యలు, కొన్ని A2P కాల్స్‌కు నిమిషానికి 5 పైసల వరకు టెర్మినేషన్ ఛార్జీ, వినియోగదారులకు అప్పీల్ అవకాశం వంటి మార్పులను కూడా ట్రాయ్ తీసుకొచ్చింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!