

స్థిరాస్తి మార్కెట్‌లో కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గతంలో తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయనే అంచనాలతో స్పెక్యులేటివ్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపిన వారు ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పుకార్లు, తాత్కాలిక డిమాండ్, కృత్రిమంగా పెంచిన ధరలను మాత్రమే ఆధారంగా చేసుకోకుండా ఆస్తి అసలు విలువ, భవిష్యత్ అవకాశాలను పరిశీలిస్తున్నారు.
భూమి, ప్లాట్లు లేదా ఇతర ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టే ముందు ప్రాంతంలోని మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలు, కనెక్టివిటీ, ప్రస్తుత మార్కెట్ ధరలు, అభివృద్ధి అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. పారదర్శకమైన, న్యాయమైన ధరలకు లభించే ఆస్తులకు ప్రాధాన్యత పెరుగుతోంది. స్పెక్యులేషన్ తగ్గి వాస్తవ విలువ ఆధారిత కొనుగోళ్లు పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత స్థిరంగా, పరిపక్వంగా మారే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!