

లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాథమిక ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు తర్వాత దేశంలో టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోళ్లలో గణనీయమైన మార్పు కనిపించినట్లు పాలసీబజార్ తాజా నివేదిక వెల్లడించింది. జీఎస్టీ సంస్కరణల అనంతరం టర్మ్ పాలసీల కొనుగోళ్లు 1.5 రెట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ప్రీమియం వ్యయం తగ్గడంతో పాటు కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో వివిధ వర్గాల ప్రజలు లైఫ్ కవర్లపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిపింది.
అధిక మొత్తంలో కవరేజీ కోరుకునే ఎన్ఆర్ఐలు, హెచ్ఎన్ఐల్లోనూ కొనుగోళ్లు పెరిగాయి. రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ కవరేజీ ఉన్న పాలసీల కొనుగోళ్లు ఎన్ఆర్ఐల్లో 35 శాతం, హెచ్ఎన్ఐల్లో 32 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళలు 27 శాతం ఎక్కువ టర్మ్ పాలసీలు కొనుగోలు చేయగా, గృహిణుల విభాగంలో 60 శాతం వృద్ధి నమోదైంది. 18–25 ఏళ్ల యువతలోనూ ఇతర వయసు వర్గాల కంటే 20 శాతం వేగంగా కొనుగోళ్లు పెరిగాయి. ఏపీ, తెలంగాణలో 39 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!