

భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ సుంకాన్ని 17 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. చైనా, వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే భారత ఉత్పత్తులపై అమెరికా తక్కువ సుంకాలను ప్రతిపాదించడం గమనార్హం. ప్రస్తుతం అమల్లో ఉన్న 10 శాతం బేస్‌లైన్ టారిఫ్‌కు ఈ సుంకం అదనంగా ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండింటిలో ఏ రేటు ఎక్కువగా ఉంటే అదే వర్తిస్తుందని వెల్లడించారు.
వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగనున్న భేటీ అనంతరం ఈ ప్రతిపాదనపై తుది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే భారతీయ ఎగుమతిదారులకు 17 శాతం సుంకం వర్తించే అవకాశం ఉంటుంది. ఈ చర్చల ఫలితాలు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు, అమెరికా మార్కెట్‌కు భారత ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!