

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కు ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా సరదాగా చీవాట్లు పెట్టారు. ‘కాఫీ విత్ కరణ్’ షోలో జరిగిన ఓ ప్రాంక్ కాల్ ఈ ఆసక్తికరమైన సంఘటనకు వేదికైంది. ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్‌తో పాటు భోజ్‌పురి నటుడు రవికిషన్ పాల్గొన్నారు. హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ సరదాగా సమాధానాలు చెబుతూ సందడి చేశారు. ఈ క్రమంలో అక్షయ్ తన భార్య ట్వింకిల్‌కు ప్రాంక్ కాల్ చేశారు. అయితే, ఫోన్ ఎత్తిన వెంటనే ఆమె అక్షయ్‌పై సరదాగా విరుచుకుపడ్డారు. ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్రపోలేదని, అయినా ఉదయం ఆరు గంటలకే నిద్రలేపి భజన పాటలు పెట్టడంతో పాటు గట్టిగా పాటలు పాడుతున్నాడని ఆటపట్టించారు. కనీసం బాత్రూమ్ డోర్ అయినా సరిగ్గా మూసుకోవాలని ఎన్నిసార్లు చెప్పాలని చమత్కరించారు.
ఆ తర్వాత అక్షయ్ ఎక్కడ ఉన్నాడని ట్వింకిల్ అడగ్గా.. తాను కరణ్ జోహార్ షోలో ఉన్నానని ఆయన చెప్పారు. ఇటీవలే తాను కరణ్‌తో మాట్లాడానని, షోలోని ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌కు న్యాయనిర్ణేతగా రావాలని ఆహ్వానించారని ట్వింకిల్ వెల్లడించారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్షయ్ ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు, షోలో పాల్గొన్న రవికిషన్ తనకు గుర్తింపు తెచ్చిన వైరల్ హుక్ స్టెప్‌ను అక్షయ్‌కు నేర్పించారు. దీంతో ఈ ఎపిసోడ్ సరదా సంభాషణలు, నవ్వులతో ప్రేక్షకులను అలరించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!