

జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ భారత ప్రయాణికుల వాహన మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దేశీయ సంస్థ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో వ్యూహాత్మక పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ నియంత్రణ వాటా పొందే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కంపెనీ విలువ, పెట్టుబడి పరిమాణం, భవిష్యత్ మూలధన అవసరాలపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ పుణె సమీపంలోని చకాన్, ఛత్రపతి శంభాజీనగర్ ప్రాంతాల్లో తయారీ కేంద్రాలను కలిగి ఉంది. టైగన్, వర్టస్, కుషాక్, స్లేవియా వంటి మోడళ్లను దేశీయంగా అభివృద్ధి చేసింది. అయినప్పటికీ ఫోక్స్‌వ్యాగన్, స్కోడా బ్రాండ్లు కలిపి భారత మార్కెట్‌లో సుమారు 2 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!