
టెక్నాలజీ

దేశ ఆర్థిక వృద్ధిలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు. దేశ జీడీపీలో వాహన రంగం వాటా రూ.22.75 లక్షల కోట్లకు పైగా ఉందని, ప్రభుత్వ జీఎస్‌టీ ఆదాయంలో దాదాపు 15 శాతం ఈ పరిశ్రమ నుంచే సమకూరుతోందని తెలిపారు.
వాహన పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్లకు పైగా మందికి ఉపాధి కల్పిస్తోందని శైలేష్ చంద్ర పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి కూడా ఆటోమొబైల్ పరిశ్రమ కీలకంగా దోహదపడుతోందన్నారు. గురువారం జరిగిన SIAM 66వ వార్షిక సదస్సులో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!